NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరులో జనసేనకు మరో విజయం..

1 min read

11 వ డివిజన్లోని దక్షిణపు వీధిలో రెడ్డి అప్పల నాయుడు రాకతో అధికారుల్లో కదలిక..

వెంటనే స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు నియోజకవర్గం 11 వ డివిజన్లోని దక్షిణపు వీధిలో ఉన్న డ్రైన్లు సమస్యలపై రెడ్డి అప్పల నాయుడు  రాకతో అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు.శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా ఇక్కడ ఉన్న చెత్తను తొలగించి డ్రైన్లు శుభ్ర పరిచారు. ఆ పరిసర ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయడంతో స్థానిక ప్రజలు రెడ్డి అప్పల నాయుడు  మీద ప్రశంసలు కురిపించారు. సమస్య ఉన్న చోట రెడ్డి అప్పల నాయుడు తక్షణం ఉంటారని, స్పందిస్తారని మరోసారి నిరూపితం అయ్యింద స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అడిగేంత వరకు అధికారుల్లో చలనం రాదా. ఇకనుండి ఐన అధికారులు మత్తు నిద్ర వదిలి నియోజకవర్గం లోని ప్రజలకు అసౌకర్యం కలిగించేల ఇలాంటి సమస్యలపై స్పందించాలని రెడ్డి అప్పల నాయుడు అధికారులను కోరారు. వెంటనే స్పందించిన అధికారులకు రెడ్డి అప్పల నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author