చైనాలో మరో వైరస్.. అలర్ట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : చైనాను మరో వైరస్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. కాగా, ఇది ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న బాలుడు(4) కొద్దిరోజుల క్రితం జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతడికి పరీక్షలు చేయగా అతడికి ఈ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. కాగా, సదరు బాలుడు పక్షుల ద్వారానే ఈ వ్యాధి బారినపడినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని.. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది.