భానుడి భగ భగ ..మరో వారం రోజులు వడ గాల్పులు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివెముల : ఏప్రిల్ నెల మొదలు కాక ముందే భానుడి ఉగ్ర రూపం దాలుస్తున్నాడు గత. ఏడు సరైన వర్షాలు కురవక నదులు ఎండిపోయాయి గడివెముల మండల కేంద్రంలో ఉదయం 11 గంటలకే వీధులు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు గత వారం రోజులుగా ఎండలు 41..డిగ్రీలుగా నమోదవుతున్నాయి మరో వారం రోజులు వడ గాల్పుల ప్రభావం నంద్యాల జిల్లాలోని మండలాల్లో ఉంటుందని వాతావరణ శాఖ సూచన మేరకు ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు తమ అవసరాల మేరకు బయటకు రావాలని తాగడానికి నీరు రక్షణకు క్యాప్ లేదా కర్చీఫ్ అందుబాటులో ఉంచుకోవాలని ముఖ్యంగా ద్విచక్ర వాహనాదారులు మధ్యాహ్నం ప్రయాణం చేయడం మానుకోవాలని వడ దెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలని వడ దెబ్బ లక్షణాలు వాంతులు కళ్ళు తిరగడం విరేచనాలు తో శరీరంలో నీటి శాతం తగ్గడంతో మరణం సంభవించే అవకాశం ఉంటుందని వెంటనే వడ దెబ్బకు గురైన వ్యక్తి కి ఓ అర్ ఎస్ ద్రావణం తాగించాలని కాటన్ వస్త్రాలు చల్లని నీటిలో తడిపి రోగి శరీరాన్ని తూడవాలని ప్రథమ చికిత్స అనంతరం ప్రథమ చికిత్స కోసం అందుబాటులో ఉన్న ఆస్పత్రికి తరలించాలని అర్ ఎం పీ డబ్ల్యూ ఏ నంద్యాల జిల్లా కార్యదర్శి వీ వీ కృష్ణయ్య తెలిపారు.