NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ ప్రభుత్వానికి ఓటుతో సమాదానం చెప్పండి

1 min read

– ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన కాకరవాడ చిన్న వెంకటస్వామి,రమేష్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని దేవనూరు నాగులూటి,పైపాలెం గ్రామాలలో టిడిపి నాయకులు పర్యటిస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు.ముందుగా దేవనూరు గ్రామంలో కే.బ్రహ్మానందరెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మరియు మిడుతూరు మండల టిడిపి కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.తదనంతరం మీ ప్రథమ ఓటును టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మీ ప్రథమ ఓటును వేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటూ కాకరవాడ చిన్న వెంకటస్వామి మరియు రమేష్ రెడ్డి పట్టభద్రుల ఓటర్లను అభ్యర్థించారు.మండల పరిధిలోని దేవనూరు,నాగలూటి,పైపాలెం గ్రామాలలో ఉన్న పట్టభద్రుల ఇండ్లకు వెళ్లి టిడిపి కరపత్రాలను ఓటర్లకు అందజేశారు.వచ్చేనెల 13వ తారీఖున ఎన్నికలు ఉన్నాయని మీ ఓట్లను సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించడం లేదని గ్రామాలు అభివృద్ధి చేయాలన్నా ప్రజలు అభివృద్ధి పథంలో ఉండాలన్నా అదంతా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.అభివృద్ధి పనులు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటూ గొప్పలు చెబుతున్నారు కానీ అవన్నీ మాటలకే పరిమితమని కాకరవాడ చిన్న వెంకటస్వామి,రమేష్ రెడ్డి అన్నారు.మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న పట్టభద్రుల దగ్గరికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిస్తామని వారు తెలియజేశారు.ఈకార్యక్రమంలో నాగలూటి టిడిపి నాయకులు సంపంగి రవీంద్రబాబు, రమణారెడ్డి,వెంకటరమణారెడ్డి,పి బాబు సాహెబ్, పైపాలెం ఎర్రబోలు రాంభూపాల్ రెడ్డి,నాగేశ్వరరావు,నంద్యాల జిల్లా టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ సుల్తాన్,దేవనూరు టిడిపి నాయకులు మరియు మాజీ సర్పంచ్ నాగేంద్రుడు,వీరారెడ్డి,కృష్ణారెడ్డి,కలీం,డివి రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author