కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులైన అంబానీ ఆదానీలకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పు తీసుకువస్తూ రైతు ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడాన్ని వ్యతిరేకిస్తూ మతతత్వ విధానాలను ముందుకు తెస్తూ కార్మికులకు రైతులకు ప్రజలకు ఆమోదయోగ్యం కాని చట్టాలను రూపొందించి పరిపాలన కొనసాగిస్తున్న నరహంతక ప్రధాని నరేంద్ర మోడీ నిరంకు శత్వానికి వ్యతిరేకంగా నిన్న దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా హమాలి వర్కర్స్ యూనియన్(IFTU)అధ్యక్షులు జి.పెద్దస్వాములు అధ్యక్షతన గ్రామీణ భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శి కె.అరుణ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేత్తనం 26 వేలు నిర్ణయించాలని అలాగే నాలుగు లేబర్ కోడ్స్ మరియు విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర గ్రామీణ హమాలీ మరియు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలి.అన్ని రకాల ఆహార వస్తువులపై జిఎస్టీ ఉపసంహరించాలి.ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి ఈ స్కీమును పట్టణాలకు విస్తరించాలి.కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి ఉద్యోగ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలి. నూతన విద్యా విధానం 2022 చట్టాన్ని రద్దు చేయాలని అయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు మద్దిలేటి హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు మద్దిలేటి,స్వాములు,నవీన్ ఎలీషా,చిన్న స్వాములు తదితరులు పాల్గొన్నారు.