దేశ వ్యతిరేక కంటెంట్.. 35 యూట్యూబ్ ఛానెళ్ల పై వేటు
1 min readపల్లెవెలుగువెబ్ : భారత వ్యతిరేక కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెళ్ల పై కేంద్రం చర్యలు తీసుకుంది. వాటిని బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసారశాఖ వెల్లడించింది. ఈ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వెబ్ సైట్లను పాకిస్థాన్ నుంచి నిర్వహిస్తున్నారని సంబంధిత శాఖ జాయింట్ సెక్రటరీ విక్రమ్ సహాయ్ తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానెళ్లకు మొత్తం 1.20 కోట్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారని, అప్ లోడ్ చేసిన వీడియోలకు 130 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయని ఆయన తెలిపారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. భారత సాయుధ దళాలు, బిపిన్ రావత్ మరణం, కశ్వీర్ అంశాల పై భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని విక్రమ్ చెప్పారు.