మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
1 min readపల్లెవెలుగువెబ్ : రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా…. నారాయణ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. నారాయణకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది పోసాని కోరారు. కింద కోర్టులో కూడా మిగతా నిందితులకు సెక్షన్‌లు వర్తించవని రిమాండ్‌ను తిరస్కరించిన అంశాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.