NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వ‌ద్ద ఆందోళ‌న‌.. ఉద్రిక్తత‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : విశాఖ ఉక్కు ప‌రిశ్రమ ప్రైవేటీక‌ర‌ణ ప్రక్రియ వేగ‌వంతం పై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వ‌ద్ద కార్మిక సంఘాల నేత‌లు నిర‌స‌న వ్యక్తం చేశారు. ప్రైవేటీక‌రణ నిర్ణయం వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు సిద్ధమ‌వుతున్నట్టు స‌మాచారం. ఈ మేరకు ట్రాన్సాక్షన్ అడ్వయిజ‌ర్, లీగ‌ల్ అడ్వయిజ‌ర్ నియామ‌కానికి అధికారులు క‌స‌రత్తు చేస్తున్నారు. ఉక్కు ప‌రిశ్రమ ప్రైవేటీక‌రిస్తామ‌ని ప్రభుత్వం ప్రక‌ట‌న చేసినప్పటి నుంచి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మిన‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు ఉక్కు ప‌రిశ్రమ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్యతిరేకిస్తున్నాయి.

About Author