NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రుయా ఎదుట ఆందోళ‌న‌.. నారాయ‌ణ అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తిరుప‌తి రుయా ఆస్పత్రి ఎదుట సీపీఐ ఆందోళ‌న చేప‌ట్టింది. ఆక్సిజ‌న్ కొర‌త‌తో 11 మంది చావుకు కార‌ణ‌మైన వారి మీద చ‌ర్యలు తీసుకోవాల‌ని సీపీఐ నాయ‌కులు డిమాండ్ చేశారు. ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చూడాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుయా ఆస్పత్రి ఎదుట సీపీఐ ఆందోళ‌న కార్యక్రమంలో పాల్గొనేందుకు వ‌స్తున్న సీపీఐ జాతీయ కార్యద‌ర్శి నారాయ‌ణ‌ను పోలీసులు అరెస్టు చేశారు. న‌గ‌రి స‌మీపంలో సీపీఐ నారాయ‌ణ‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం నారాయ‌ణ స్వగ్రామం ఐనంబాకంకు ఆయ‌న‌ను త‌ర‌లించారు. సీపీఐ నారాయ‌ణ అరెస్టు ప‌ట్ల సీపీఐ రాష్ట్ర కార్యద‌ర్శ రామ‌కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోయిన వారంద‌రివీ.. ప్రభుత్వ హ‌త్యలే అని విమ‌ర్శించారు.

About Author