NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

థియేట‌ర్ లో ప్రేక్ష‌కుల ఆందోళ‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : థియేటర్‌కు వెళితే ఏసీలో అయినా ఉపసమనం పొందవచ్చని కొంద‌రు భావిస్తుంటారు. ఏసీ కోస‌మే సినిమాకు వెళ్లేవారు కూడ ఉంటారు. ఇదే విధంగా ఆదివారం కొంద‌రు అభిమానులు కడప ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ ప్రముఖ సినిమా ఆడుతున్న థియేటర్‌కు మొదటి ఆటకు వెళ్లారు. అయితే సినిమా ప్రారంభం నుండి ఏసీ వేయలేదు. ఇంట్రవెల్‌ అనంతరం కూడా థియేటర్‌లో ఏసీ వేయకపోవడవంతో బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. తాము సినిమా టికెట్‌ రూ.250 చెల్లించి సినిమాకు వెళితే ఏసీ వేయకపోవడంతో హాలులోపల ఉక్కతో జనం రద్దీతో ఇబ్బందులకు గురయ్యామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పవర్‌ ఎఫెక్ట్‌ కారణంతోనే ఏసీ నిలుపుదల చేశామంటూ థియేటర్‌ యజమానులు వారికి చెప్పినప్పటికీ టికెట్ల ధరలు మాత్రం అమాంతంగా పెంచి ఇలా నిలువుదోపిడీ చేయం ఏమిటంటూ వారు ప్రశ్నించడంతో పాటు థియేటర్‌ వద్ద ఆందోళన చేస్తున్నట్లు సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు థియేటర్‌ వద్దకు వచ్చి వారికి నచ్చజెప్పారు. దీంతో వారు ఆందోళనను విరమించుకున్నారు.

                                       

About Author