రాజధాని మహిళల ఆందోళన ఉద్రిక్తం
1 min read– బెజవాడ దుర్గమ్మ దర్శానికి మహిళా రైతులు
– అడ్డుకున్న పోలీసులు
అమరావతి; రాష్ర్ట రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ మహిళా దినోత్సవం నాడు .. రాజధాని ప్రాంత మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బెజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు ర్యాలీగా బయలుదేరిన మహిళలను పోలీసులు అడ్డుకుని .. అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు వెలగపూడి రైతులు సచివాలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లి , మంగళగిరి పోలీస్ స్టేషన్ లకు మహిళా రైతులను తరలించారు. అయితే.. విషయం తెలుసుకున్న మిగిలిన రైతులు… ఆయా ప్రాంతాల్లో రోడ్ల మీద ఆందోళనకు దిగారు. సీడ్ యాక్సిస్ రోడ్ లో రైతులు సేవ్ అమరావతి నినాదాలతో ఆందోళన చేపట్టారు. మహిళా దినోత్సవం నాడు.. మహిళల మీద ప్రభుత్వం దాడి చేసిందని పలువురు ఆరోపించారు. తమ మీద అక్కసు ప్రదర్శిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.