ఏపీ.. 4 వేల ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో ప్యాసింజర్ ఆటోలను రెట్రోఫిట్టింగ్ చేసి.. ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియ ప్రారంభమయ్యింది. దీని కోసం ఏపీలో 4 వేల ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రాంతాలను ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ గుర్తించింది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. తిరుపతిలో 200, విశాఖపట్నంలో 100 త్రీ వీలర్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనుంది. ప్రభుత్వ సూచనల మేరకు ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ, ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్(ఏపీఎస్‌ఈసీఎం) సంయుక్తంగా ఈ బాధ్యతలను తలకెత్తుకున్నాయి. ఈవీ వాహనాలను పరీక్షించడానికి ఒక టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీతో నెడ్‌కాప్ ఒప్పందం కుదుర్చుకుంది.