ఏపీ, తెలంగాణ సీఎంలు కుమ్మక్కయ్యారు
1 min read
పల్లెవెలుగు వెబ్ : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంలో జగన్, కేసీఆర్ లు కుమ్మక్కయ్యారని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. జలవివాదం పై అనవసర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ విషయం పై చంద్రబాబు స్పందించలేదనటం సబబు కాదన్నారు. ఏపీకి ముఖ్యమంత్రి జగనా? చంద్రబాబా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే బాధ్యత నుంచి ఏపీ ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఎందుకు బలమైన వాదనలు వినిపించడం లేదన్నారు. జగన్ ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. లేఖలు రాసుకుంటూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అంటూ ప్రశ్నించారు.