NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గంజాయి హ‌బ్ గా ఏపీ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ గంజాయి హ‌బ్ గా మారింద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశ‌వ్యాప్తంగా పెరిగింద‌న్నారు. ట్విట్టర్ ద్వార ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. గంజాయి నివార‌ణ‌కు ప్రజాప్రతినిధులు చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌న్నారు. 2018లో ఏవోబీలో త‌న పోరాట యాత్ర స‌మ‌యంలో గంజాయి పై చాలా ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని తెలిపారు. ప్రజ‌ల స‌మ‌స్యలు తెలుసుకునేందుకు పోరాట యాత్ర చేశాన‌ని, ఆ స‌మ‌యంలో గంజాయి, నిరుద్యోగం, అక్రమ మైనింగ్ కు సంబంధించిన ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఏపీలో గంజాయి మూలాలు ఉన్నాయ‌న్న హైద‌రాబాద్ సీపీ, న‌ల్గొండ ఎస్పీ వీడియో క్లిప్ ల‌ను త‌న కామెంట్స్ కు అద‌నంగా జ‌త చేశారు.

About Author