NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అఘాయిత్యాల‌కు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సీఎం జ‌గ‌న్ పాల‌న‌లో ఆంధ్రప్రదేశ్ అఘాయిత్యాల‌కు కేరాఫ్ అడ్రస్ గా మారింద‌ని టీడీపీ జాతీయ కార్యద‌ర్శి నారాలోకేష్ అన్నారు. గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్ జ‌ర‌గ‌డం దారుణ‌మ‌ని అన్నారు. బైక్ పై వెళ్తున్న జంట‌పై దాడి చేసి సామూహిక అత్యాచారం చేయ‌డం అమానుష‌మ‌ని చెప్పారు. ఫిర్యాదు చేయ‌డానికి బాధితులు పోలీస్ స్టేష‌న్ కు వెళ్తే.. ఘ‌ట‌న జ‌రిగింది త‌మ ప‌రిధి కాద‌ని చెప్పడం దారుణ‌మని అన్నారు. మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు జ‌రుగుతున్నా ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ప‌రామ‌ర్శకు వెళ్తుంటే వేల‌మంది పోలీసులను రంగంలోకి దించార‌ని అన్నారు. పోలీసుల‌ను రాజ‌కీయ కక్షసాధింపునకు జ‌గ‌న్ వాడుకోవ‌డం వ‌ల్లే ఈ దుస్థితి ఏర్పడింద‌న్నారు.

About Author