PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేప‌టి నుంచే ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ శాస‌న స‌భా స‌మావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. గురువారం ఉద‌యం 9 గంట‌లకు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌గా… శాస‌న మండ‌లి సమావేశాలు ఉద‌యం 10 గంట‌ల నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు కొన‌సాగ‌నున్న ఈ స‌మావేశాల్లో భాగంగా రేపు తొలి రోజే 3 రాజ‌ధానుల‌కు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు.. దానిపై చర్చతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించనున్నట్టు సమాచారం. 3 రాజ‌ధానుల‌పై ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లుగా వైసీపీ వ‌ర్గాలు పేర్కొన్నారు.

                                 

About Author