ఏపీ అసెంబ్లీ పరిణామాలు.. రాజీనామా చేసిన హెడ్ కానిస్టేబుల్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలతో తీవ్రకలత చెందిన ఓ కానిస్టేబుల్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కోమటినేని జయకృష్ణ కొత్తపట్నంలోని కోస్టల్ సెక్యురిటీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వేకెన్సీ రిజర్వ్ లో ఉన్నారు. చంద్రబాబు కుటుంబం పై అసెంబ్లీలో చేసిన అవమానానికి మనస్థాపం చెందినట్టు ఆయన తెలిపారు. నైతిక విలువలు లేని ఈ ప్రభుత్వంలో ఉద్యోగం చేయడం ఇష్టంలేక రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ దిగజారిపోయిందని, సాష్టాంగపడి పోస్టింగులు తెచ్చుకునే నీచస్థితికి చేరిందన్నారు. మోకరిల్లే పోలీసింగ్ చేయడం ద్వార వచ్చే డబ్బుతో తన బిడ్డలకు తిండిపెట్టొద్దనిపించిందన్నారు. అయితే.. జయకృష్ణ రాజీనామా లేఖ మాత్రం తమకు అందలేదని ఉన్నాతాధికారులు తెలిపారు. పోలీస్ శాఖపై జయకృష్ణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అతనిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.