విశాఖ ఉక్కు కోసం ఏపీ బంద్
1 min readఅమరావతి: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి. ఈ బంద్ కు రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ఒక్క భాజపా మినహాయిస్తే.. అన్నిపార్టీలు మద్దతు పలికాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడ కార్మికుల బంద్ కు మద్దతు పలికింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు బంద్ ను పాటిస్తున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కూడ మూసివేస్తున్నట్టు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు బస్టాండ్ నుంచి కదలలేదు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. లేనిపక్షంలో భవిష్యత్ లో పెద్ద ఎత్తు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించింది.