కౌతాళంలో 30న ఏపి బీసీ సంక్షేమ సంఘం సమావేశం
1 min read– జిల్లా అధ్యక్షుడు గుడిసె శివన్న
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో మే నెల 30వ తేదీన సమావేశం జరుగుతుందని బుధవారం అదొని ఐశ్వర్య లాడ్జ్ నందు విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గుడిసె శివన్న తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం కోసిగి మంత్రాలయం పెద్దకడబూరు మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులను అలాగే మంత్రాలయం తాలూకా అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుందని ఈ సమావేశానికి బీసీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని గుడిసె శివన్న కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకరరావు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కుమార్ తో పాటు మిగతా రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు. బీసీలు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తప్పకుండా యువకులు పాల్గొని జయప్రదం చేయాలని గుడిసె శివన్న కోరారు. కేంద్రం ఓబిసి కుల జనగణ వెంటనే చేపట్టాలి. అడవిలో ఉన్న పులులకు జంతువులను లేక్కలు ఉన్నాయి కానీ ఓబీసీ లకు జనగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీరిక లేదని గుడిసె శివన్న దుయ్యబట్టారు.జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే బీపీ మండల్ నిలువెత్తు కాంస్య విగ్రహాలను ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేయాలి. అపార కుల సంపద గల బీసీలకు బీసీ భవనం కోసం 50 సెంట్లు భూమిని కేటాయించాలి. జనాభా దామాషా ప్రకారం పదవులు కేటాయించాలి. రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలకే కాదు రాజకీయ రంగాలు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కేటాయించాలి. బిపి మండల్ నివేదికను వెంటనే అమలుపరచాలిమహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని బీపీ మండల్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగాప్రకటించాలి.బడుగు బలహీన వర్గాలకు అగ్రవర్ణాలను ఎదిరించి విద్యను అందించిన మహానుభావుడుజ్యోతిరావుపూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ప్రతి ఒక్క స్కూల్లో ఏర్పాటు చేసి వారి ఆశయాలనుకొనసాగించాలి.రాష్ట్రవ్యాప్తంగా జనాభా దామాషి ప్రకారం ప్రతి జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు బీసీలకు కేటాయించి రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలకు జాతీయ నాయకుల పేర్లు ప్రకటించాలి. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ వెంటనే ప్రకటించాలి. బిసి హక్కులు సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నిరంతరం పోరాడుతుందని జిల్లా అధ్యక్షులు గుడిసె శివన్న తెలిపారు.