NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ సీఐడీ కార్యాల‌యాలు అండ‌మాన్ జైళ్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలోని సీఐడీ కార్యాలయాలు అండమాన్ జైల్‌ల్లా మారాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వెయ్యి రోజులుగా అకుంఠిత దీక్షతో అమరావతి సాధన కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలను ప్రభుత్వం చులకనగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు రైతులు, మహిళల మహాపాదయాత్ర సఫలీకృతం కావాలని ఆయన ఆకాంక్షించారు. రోజురోజుకు ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతోందని, ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతలు సీఎంలో అసహనాన్ని పెంచుతున్నాయన్నారు.

                                 

About Author