ఏపీ.. ఉద్యోగమే లక్ష్యంగా కోర్సులు
1 min readపల్లెవెలుగువెబ్ : ఉద్యోగాలు కల్పించే చదువుల దిశగా కోర్సులు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పుడున్న కోర్సులకు అనుబంధ, ప్రత్యేక కోర్సులు తీసుకు రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత విద్యా శాఖను ఆదేశించారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు వీలుగా ఇంగ్లిష్‌పై పట్టు, ప్రావీణ్యం వచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జీఆర్ఈ, జీ మ్యాట్ పరీక్షల కోసం మంచి శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.