ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ పదవీవిరమణ! సచివాలయంలో వీడ్కోలు సభ
1 min read
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పదవీవిరమణ పొందారు. ఈమేరకు సచివాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. 2020 డిసెంబర్లో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్ గురువారం పదవీవిరమణ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఆదిత్యనాథ్‌కు వీడ్కోలు పలుకుతూ నూతన సీఎస్ సమీర్‌శర్మకు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ సేవలను కొనియాడారు. నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్‌శర్మను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.