రాఘవేంద్రుని సన్నిధిలో ఏపీ సీఎస్ జవహార్ రెడ్డి
1 min readపల్లెవెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం మంత్రాలయం వచ్చారు. వీరి కి శ్రీ పద్మనాభ తీర్థ అతిథి గృహం వద్ద వైకాపా యువనేత వై ప్రదీప్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంథ్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎమ్మిగనూరు డిఎస్పీ సీతారామయ్య, మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు, జోనల్ మేనేజర్ ఐపి నర్సింహులు పుష్పగుచ్ఛంను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మఠం చేరుకున్న వీరి కి మఠం ఏఏఓ మాధవ శెట్టి, శ్రీ పతి లు మఠం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. వీరు ముందు గా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరి కి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు శేషవస్తరం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి మొమొంటోతో ఆశీర్వదించారు. వీరి వెంట తహసీల్దార్ దేవ చంద్రశేఖర్, సిఐ శ్రీనివాసులు, ఎస్సై వేణుగోపాల్ రాజు, మాధవరం ఎస్సై కిరణ్, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య తదితరులు ఉన్నారు.