21వ వసంతంలోకి ఏ.పీ.దళిత హక్కుల పోరాట సమితి
1 min readజుజ్జువరపు ప్రతాప్ ఆధ్వర్యంలో వసంత వేడుకలు
జుజ్జువరపు జయరాజు ఆశయాలు నేటికీ కొనసాగుతూ బ్రతికే ఉన్నాయి
సమత సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షులు బేతాళ సుదర్శన్ రావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి స్థాపించి నేటికీ 21 సంవత్సరాలు అయిందన సందర్భంగా ఏలూరు ఆర్ఆర్ పేట పానుగంటి వారి వీధిలో అధ్యక్షులు జుజ్జువర ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో దళిత నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున 21వ వసంత వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమత సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షులు బేతాళ సుదర్శన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల వారి కోసం జుజ్జువరపు జయ రాజు ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు, ధర్నాలు ఆయన జీవించిన ఉన్నంతకాలం అలుపెరగని పోరాట యోధునిగా పని చేశారని కొనియాడారు. జుజ్జువర ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట స్థాపించి 21 వసంతాలు గడిచిన అన్న ఆశయాలు జీవించే ఉన్నాయని ఆయన బాటలో మేమంతా అహర్నిశలు దళిత బడుగు బలహీన వర్గాలకి, బహుజనుల కోసం నేటికీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నామని అందరి మన్నలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లంకలపల్లి మాణిక్యాలరావు, ఎస్సీ నాయకులు జుంజు మో జస్, నెల్లిపాక వెంకన్న, బుద్ధి జగ్గారావు, మేతర అశోక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.