ఏపీ అప్పు రూ.3,98,903.. !
1 min readపల్లెవెలుగువెబ్ : ‘స్టేట్ ఫైనాన్స్‌లు: 2021–22 బడ్జెట్‌ల అధ్యయనం’పేరుతో రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లుగా ఉందని తెలిపారు. తమిళనాడు రూ.6,59,868 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రాల రుణాలను ఆమోదించేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ద్వారా నిర్దేశించిన ఆర్థిక పరిమితులను అనుసరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.