ఉద్యోగాల భర్తీకి ఏపీ కసరత్తు
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మేలో ఉద్యోగ కేలండర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శాఖల వారీగా ఖాళీలు లెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు లెక్కించిన తర్వాత ఉద్యోగాల కేలండర్ విడుదల చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వార ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ విభాగాల్లో, సంస్థల్లో ఖాళీలను, అవసరమైన సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని, తద్వార ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయం ఆన్ లైన్ పోర్టల్ ద్వార అందరికీ అందుబాటులోకి వస్తుంది.