మెడికల్ కాలేజీ క్యాంటీన్ తమకు అప్పగించాలని కోరిన ఏపీ జి డి ఏ…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మెడికల్ కాలేజీ క్యాంటీన్ తమకు అప్పగించాలని కోరిన ఏపీ జి డి ఏ… పూర్తి వివరాలు అందజేయాలని నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ.. కర్నూలు మెడికల్ కాలేజీ క్యాంటీన్ వ్యవహారంపై శుక్రవారం కాలేజి లోని కౌన్సిల్ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో క్యాంటీన్ లీజు ఐదు సంవత్సరాలు దాటి చాలా కాలం అయిపోయిందని కావున క్యాంటీన్ ను తమకు అప్పగించాలని ఏపీజీడిఏ నాయకులు ప్రిన్సిపాల్ ని కోరడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధిపతులు మాట్లాడుతూ కాలేజీ క్యాంటీన్ అందరికీ అవసరమైనదని ఇప్పటికే ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఈ వివాదాన్ని త్వరగా ముగిస్తే మంచిదని కోరడం జరిగింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్యాంటీన్ వ్యవహారం ఏపీజీ.డి.ఏ కు క్యాంటీన్ నిర్వాహకులకు మధ్య జరిగిన ఒప్పందం అని అవున ఆ ఒప్పంద పూర్తి వివరాల కాపీలు అందచేయాలని సమస్యల విషయం లో ఇప్పటికే కోర్టు పరిధికి వెళ్ళినందున పాత కొత్త సభ్యులందరూ వారే అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకొని సమస్యపరిష్కరించకుంటే మంచిదని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ అన్నారు.. క్యాంటీన్ విషయంలో అందరు సభ్యులు కోరిన విధంగా క్యాంటీన్ త్వరగా ఓపెన్ చేసేందుకు స్టాప్ కౌన్సిల్ సభ్యుల కోరిక మేరకు అందుబాటులో ఉన్న అన్ని వివరాలతో గౌరవ జిల్లా కలెక్టర్ కి డీ.యం.ఈ కి నివేదిక సమర్పిస్తామని తదుపరి వారి ఆదేశాల మేరకు త్వరలో క్యాంటీన్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తుత క్యాంటీన్ విషయంపై సమస్యలు ఉన్నందున అంతవరకు స్టాఫ్ కు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మరేదైనా ప్రదేశంలో క్యాంటీన్ నిర్వహణకు అనుమతిస్తే బాగుంటుందని కొందరు సభ్యులు కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ విజయ ఆనంద్ బాబు, హెచ్ ఓ డిలు శ్రీమతి సుధా కుమారి, అమీరున్నిసా బేగం, ఏపీ జి డి ఏ ప్రెసిడెంట్ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్, నాయకులు ధామమ్ శ్రీనివాసులు, డా.సొమ్మప్ప, డాక్టర్ రామ కృష్ణ నాయక్, రామ్ శివ నాయక్,రామ డాక్టర్ మాధవి శ్యామల తదితరులు పాల్గొనడం జరిగింది.