ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్స్ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
1 min read
రానున్న రోజుల్లో ఎండ తీవ్రతలను గుర్తించి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అధ్యక్ష , కార్యదర్శులు
తోట.శ్రీనివాసరావు,ఎస్.ఎన్.వి శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రస్తుతం వేసవిలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా నిత్యం జిల్లా సర్వజన ఆసుపత్రికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అలాగే రహదారి వెంబడి వాహనదారులు పాదచారులు గుక్కెడు వాటర్ ప్యాకెట్ నీళ్ళు మూడు నాలుగు రూపాయలు అమ్మ ఈరోజుల్లో తమ అవసరాలకు తెచ్చుకున్న డబ్బులు దాహం తీర్చుకోవడానికి సరిపోయే విధంగా వ్యాపారస్తులు వ్యాపారం సాగిస్తున్నారు.ప్రజలు ఎండతీవ్రత నుండి ఉపసమనం పొందడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలను సారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వవాహనాల డ్రైవర్స్ సంఘo ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కోర్టు సెంటర్ నందు సోమవారం మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుత వేసవిలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని, చిన్నపిల్లలతో తిరగవద్దని, సంఘం సభ్యులు సూచించారు. రానున్న రోజుల్లోఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల దృష్ట్యా బయట ప్రాంతాలలో తిరిగే ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రైసిడెంట్ తోట శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి ఎస్.ఎన్.వి. శ్రీనివాస్,అసోసియేటడ్ ప్రైసిడెంట్ జి.ఈశ్వర్ రావు, గౌరవఅధ్యక్షులు వైజిఎల్ నారాయణ,జిల్లావైస్ ప్రైసిడెంట్ డి. వేణుగోపాలస్వామి,రిటైడ్ ప్రైసిడెంట్ వై.నాగరాజు, రామాంజనేయులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.