దుర్గమ్మసేవలో ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్
1 min read
పల్లెవెలుగువెబ్, విజయవాడ: దేవీశరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకిలాద్రి దుర్గమ్మను ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ దంపతులు గురువారం సందర్శించారు. ఈమేరకు వారు దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉభయదేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్గమ్మ దర్శనార్థం వచ్చని గవర్నర్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీవాసులు, చైర్మన్ సోమినాయుడు, ఎమ్మెల్యేయ మల్లాడివిష్ణు, ఆలయ అధికారులు, అర్చకస్వాములు, పండితులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. స్వామిఅమ్మవార్ల సేవానంతరం గవర్నర్ దంపతులను ఆలయ పండితులు సంప్రదాయ బద్ధంగా ఆశీర్వచనం వల్లించగా మంత్రి వెల్లంపల్లి స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.