డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ను కలిసిన ఏపీ హజ్ కమిటీ సభ్యులు
1 min read
కర్నూల్, న్యూస్ నేడు: డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సబియా పర్వీన్ ను కలిసిన ఏపీ హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి సబియా పర్వీన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ నూతన సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన సూరి మన్సూర్ అలీ ఖాన్ నేడు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్బంగా డిఎండబ్య్లుఓ .. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ కి శుభాకాంక్షలు తెలియజేసి, సన్మానించడం జరిగింది. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే హజ్ యాత్రికులకు సేవ చేసే అవకాశం లభించడం ఓ అరుదైన అవకాశమని ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని డిఎండబ్య్లుఓ ఆకాంక్షించారు. అనంతరం మైనార్టీ అంశాలపై చర్చించడం జరిగింది.