ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు ఐఏఎస్ లకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళకు చెందిన భూమి తీసుకుని పరిహారం ఇవ్వకపోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినా చెల్లింపులో ఆలస్యం జరగడంతో.. ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు 1000 జరిమానా, జైలు.. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు 1000 జరిమానా, 2 వారాల జైలు శిక్ష.. ఎస్.ఎస్. రావత్ కు 1000 జరిమానా, నెలరోజుల జైలు.. ముత్యాలరాజుకు 1000 జరిమానా, రెండు వారాల జైలు శిక్ష, మరో ఐఏఎస్ అధికారికి కూడ జైలు శిక్ష విధించారు. అయితే శిక్ష పై అప్పీలు చేసుకునేందుకు నెలరోజులు గడువు ఇచ్చింది.