ఏపి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డిని తొలగించాలి
1 min read– రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ. చైర్మన్ శ్రీరాములు డిమాండ్..
పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్ : రాష్ట్రంలో ఉన్నత విద్యను పేద వర్గాలకు దూరం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో అవినీతిని ప్రోత్సహిస్తూ ఉన్నత విద్యను భ్రష్టు పట్టించిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి నీ వెంటనే తొలగించి అర్హులైన మరియు మేధావి వర్గానికి చెందిన ప్రొఫెసర్లను నియమించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను కాపాడాలని సోమవారం నాడు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ బి.శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేశారని అదేవిధంగా ఆన్లైన్ అడ్మిషన్ పేరుతో ప్రైవేట్ యూనివర్సిటీలతో అదే విధంగా పక్క రాష్ట్రాలు చెందినటువంటి ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్స్ తో చీకటి ఒప్పందం చేసుకొని డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపైన సిబిసిడి విచారణ చేయాలని అదేవిధంగా రాష్ట్రంలోనే వివిధ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతిని హేమ చంద్రారెడ్డి గారు పెంచి పోషిస్తున్నారని వారు అన్నారు. అదేవిధంగా కోర్టుల ద్వారా స్టే మీద కొనసాగుతున్నటువంటి ప్రొఫెసర్లకు రిజిస్టార్, అదేవిధంగా రెక్టారులు, మరియు నామినేటెడ్ పదవులు ఇస్తూ అక్రమంగా నియమింపబడిన ప్రొఫెసర్లను ప్రోత్సహిస్తూ ఉన్నత విద్యను నాశనం చేస్తున్నారు హేమచంద్రారెడ్డి గారు చేసిన అవినీతిని ఆధారాలతో సహా రుజువు చేస్తామని, రాష్ట్రంలోని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి విధానాన్ని తుంగలో తక్కి యూనివర్సిటీ అధికారాలను హేమచంద్ర రెడ్డి గారు తన చేతిలో తన గుప్పెట్లో ఉంచుకున్నారని అన్నారు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ విద్యార్థులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి హేమ చంద్రారెడ్డి చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు హేమచంద్ర రెడ్డి నిర్ణయాలను తప్పుపట్టాల్సినటువంటి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మౌనంగా ఉండడం చాలా దారుణమని వారు అన్నారు. అవినీతిపైన చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉంటే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పైన రాష్ట్రపతికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.