రిటైల్ రంగంలోకి ఏపీ మార్క్ ఫెడ్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ సహకార మార్కెటింగ్ సమాఖ్య రిటైల్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. రైతుల నుంచి సేకరించే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అందుబాటు ధరల్లో నాణ్యమైన నిత్యావసర సరుకుల్ని ప్రజల వద్దకు తీసుకెళ్తోంది. తొలి విడతగా బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి, కారం వంటి 12 రకాల నిత్యావసర సరుకులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందుకోసం మార్క్‌ఫెడ్ అండర్ టేకింగ్ ఫర్ పీపుల్ పేరిట నెలకొల్పిన కంపెనీ లోగోను విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆవిష్కరించారు.