ఏపీ.. వివాహిత పై సామూహిక అత్యాచారం, హత్య !
1 min readపల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. దుగ్గిరాల మండలం, తుమ్మపూడిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. తుమ్మపూడికి చెందిన మహిళ పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త తిరుపతిలో పనిచేస్తూ అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవాడు. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది ఉండడాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృత దేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఒంటిపై దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురిపై అనుమానం ఉన్నట్లు మృతురాలి భర్త ఆరోపించారు.