ముంబై ఆస్పత్రిలో ఏపీ మంత్రి
1 min readపల్లెవెలుగువెబ్: గుండె జబ్బు బారిన పడ్డ ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు సోమవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆపరేషన్ మొదలైంది. ఈ ఉదయం 10 గంటలకు విశ్వరూప్ గుండెకు మొదలైన ఆపరేషన్ గంటల తరబడి కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలు దాటినా విశ్వరూప్‌కు ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఈ నెల 2న వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సందర్భంగా అనారోగ్యానికి గురైన విశ్వరూప్ రాజమహేంద్రవరంలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లో వైద్యం చేయించుకున్నారు. ఈ సందర్భంగా విశ్వరూప్‌కు పెద్ద ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పిన రోజుల వ్యవధిలోనే ఆయన మరోమారు అనారోగ్యానికి గురి కాగా… మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలించిన సంగతి తెలిసిందే.