PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానంటూ.. ఓ రేంజ్‌లో ఫైర్

1 min read


పల్లెవెలుగు వెబ్: చంద్రబాబు, లోకేష్‌పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పెదబాబు, చినబాబు చర్మం ఒలిచి సీఎం జగన్‌కు చప్పులు కుట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. సీఎం ఇంటిని తాకుతాను అంటున్న లోకేష్… చంద్రబాబు కొడుకువే అయితే సీఎం ఇంటి గుమ్మాన్ని తాకాలని సవాల్ విసిరాను. మంగళగిరిలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్.. అధికారంలోకి వస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే కుక్కను కొట్టినట్లు కొడతామని కొడాలి నాని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబు పరిస్థితి తలకిందులైందని.. గెలవడానికి నానా పాట్లు పడుతున్నాడని సెటైర్ వేశారు. చంద్రబాబు పంచాయతీ స్థాయికి దిగజారి పోయాడు.. చంద్రబాబు ఓ పెద్ద కుక్క, గుంట నక్క అంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఘటన‌పై కూడా నాని స్పందించారు. టీడీపీ, వామపక్షానికి చెందిన విద్యార్ధి నాయకులు ధర్నాలోకి ప్రవేశించటంతో హింస చెలరేగిందన్నారు.

About Author