15 గంటలైనా కదలని ఏపీ మంత్రి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్యాణదుర్గంలో మంత్రి ర్యాలీ సందర్భంగా.. పోలీసుల ఆంక్షలతో 7 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి చెందిందంటూ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చేస్తున్న చిన్నారి కుటుంబీకులను పట్టించుకోకుండా ఉషశ్రీ వెళ్లిపోయారు. ఘటన జరిగి 15 గంటలు దాటినా బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించలేదు.