ఏపీ ఎన్జీవోస్ జేఏసి ఉద్యమానికి.. ఆర్టిసి ఉద్యోగులు సంఘీభావం
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీ జెఎసి పిలుపుమేరకు. ఎన్ ఎం యు ఏ. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏపీ ఎన్జీవోస్ జేఏసీ చేస్తున్న ఉద్యమానికి ఏపీఎస్ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపో ఎన్ ఎం యు నాయకులు సంఘీభావం తెలుపుతూ మూడవరోజు ఎమ్మిగనూరు డిపోలో డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్ కార్యక్రమాన్ని చేశారు.సభను ఉద్దేశించి డిపో కార్యదర్శి మాట్లాడుతూ30% మద్యంతర భృతి మంజూరు చేయాలని,పెండింగ్లో ఉన్న డి .ఏ.లను విడుదల చేయాలని, డి. ఏ బకాయిలు మరియు పిఆర్సి బకాయిలు చెల్లింపులు చేయాలని, అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధోరణ చేయాలని, పూర్తి నగదు రహిత వైద్య (హెల్త్ ) కార్డులను పంపిణీ చేయాలని ,ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంపు చేయాలని, అన్ని శాఖలలో ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పదవీ విరమణ పొందిన మరియు మరణించిన ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు మరణించిన ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని మరణించిన ఉద్యోగి కోరారు. ఈ కార్యక్రమంలో డిపో డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్, ఎం ఎం డి షరీఫ్, ట్రెజరర్ బందే నవాజ్, గ్యారేజీ కార్యదర్శి పెయింటర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.