ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ నర్సుల సంఘం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం మర్యాదపూర్వకంగా కర్నూలు జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తీ పాటి నాగరాజు ని నిన్న సాయంత్రం కలిసి నర్సుల సమస్యలను విన్నవించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో నర్సెస్ అసోసియేషన్ రూం ను రెనోవేషన్ చెయ్యాలి అని, హెడ్ నర్సు పోస్టులు, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిభందనలకి అనుగుణముగా పెంచాలి అని, కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రేగులరైజ్ చెయ్యాలి అని, కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు కీ 100 పర్సంట్ గ్రాస్ సాలరీ చెయ్యాలి అని విన్నవించడము జరిగింది. ఈ సమావేశంలో నర్సెస్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షురాలు లీలావతి, కార్యదర్శి బంగారి, వైస్ ప్రసిడెంట్ శాంతి భవాని, ట్రెజరర్ లక్ష్మి నరసమ్మ పాల్గొన్నారు.