శ్రీలంక బాటలో ఏపీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే.. శ్రీలంక బాటలో సాగుతోందని ఆందోళన కలుగుతోంది అన్నారు. ఇదే విషయాన్ని తాము 4 నెలల నుంచి చెబుతున్నామని.. ఇప్పుడు కేంద్రం కూడా ఆదేమాట చెబుతోందని పయ్యావుల గుర్తు చేశారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదమని హెచ్చరించారు. ఇప్పటికైనా అంతా మేలుకొని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం జరిగేలా చూడాలి అంటూ పయ్యావుల డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తే.. శ్రీలంక కంటే నాలుగురెట్లు అధికంగా ఏపీ అప్పు చేసిందంటూ వెల్లడించారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆర్థిక సంక్షోభం తలెత్తక మరేమవుతుందంటూ పీఏసీ చైర్మన్ అయిన పయ్యావుల ప్రశ్నించారు.