ఏపీ సర్కార్ ఫెయిల్యూర్ !
1 min read
పల్లవెలుగువెబ్ : వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్ విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై నమ్మకం కోల్పోవడంతోనే విలీన గ్రామాల్లో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. నీరు, విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందుల్లో వరద బాధితులున్నారని పేర్కొన్నారు. విలీన మండలాల్లో 14 రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడం దారుణమన్నారు. వరద బురదను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు.