ఏపీ టెన్త్ పరీక్ష.. హిందీ పేపర్ లీక్
1 min read
పల్లెవెలుగువెబ్ : శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజీ కలకలం రేపుతోంది. సరుబుజ్జిలి మండలంలోని రొట్ట వలస, సలంత్రీ పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. గురువారం హిందీ పేపర్ బయటకు రావడం చర్చనీయాశంమవుతోంది. అధికారుల బాధ్యతా రాహిత్యంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసపెట్టి ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతుండడంతో కష్టపడి చదివిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఇలాంటి ఘటనలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరల ఇవాళ హిందీ పేపర్ బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.