ఏపీ .. శ్రీలంకలా మారే ప్రమాదం !
1 min readపల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని తప్పుబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సరిదిద్దుతామని ప్రకటించారు. కరెంట్ ఎందుకు పోతుందో.. బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలి? అని ప్రశ్నించారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనపై ఆయన సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదని తెలిపారు. వ్యక్తిగత అవసరాల కోసమే పదవులు ఇస్తున్నారని చంద్రబాబు తప్పుబట్టారు.