NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం జ‌గ‌న్ పై ఏపీ వ్యాప్తంగా ఫిర్యాదులు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేష‌న్లలో టీఎన్ఎస్ఎఫ్ నాయ‌కులు ఫిర్యాదులు చేశారు. నిరుద్యోగ విప్లవాన్ని సృష్టించిన ఘ‌న‌త వైసీపీదేనని తెలుగునాడు విద్యార్థి ఫెడ‌రేష‌న్ నాయకులు విమ‌ర్శించారు. ఏపీలోని నిరుద్యోగుల‌ను మోసం చేసిన జ‌గ‌న్ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ప‌లు పోలీస్ స్టేష‌న్లలో ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి, క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు, క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగు అర్బన్, రాజంపేట పట్టణ పోలీస్ స్టేష‌న్, విశాఖ ఎంవీపీ జోన్ పోలీస్ స్టేష‌న్ లో జ‌గ‌న్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 420 కింద సీఎం జ‌గ‌న్ పై కేసులు న‌మోదు చేయాల‌ని టీఎన్ఎస్ఎఫ్ నాయ‌కులు డిమాండ్ చేశారు.

About Author