PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చదవుతో పాటు వివిధ కోర్సులలో శిక్షణా నైపుణ్యం అవసరం

1 min read

– విజయవాడ వైయస్సార్ సిపి అధ్యక్షులు బోప్పన భవ కుమార్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఏపీలో ఉన్న విద్యార్థులకు విహెచ్ఎస్ ఆధ్వర్యంలో కెరియర్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని విజయవాడ వైఎస్ఆర్సిపి జిల్లా ఇంచార్జ్ బొప్పన భవ కుమార్ అన్నారు. అనంతరం విహెచ్ఎస్ కెరియర్ ట్రైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వరదు హేమశ్రీ మాట్లాడుతూ అనంతరం మనమైతే ఒక సిక్స్ ఇయర్స్ నుంచి హెచ్ ఆర్ ఫీల్డ్ లో ఉన్నామన్నారు. ఉన్నత చదువులు చదివి జాబ్స్ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఇంటర్వ్యూ స్కిల్స్ లేక పోతే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల విద్యార్థులు అనేక సమస్యలతో గందరగోళం గురి అవుతారని తెలిపారు. అటువంటి విద్యార్థుల కోసం వారి కెరియర్ను ఎలా డెవలప్ చేసుకోవాలి ఇంటర్వ్యూకి ఎలా చేయాలో ఇంటర్వ్యూ కి వెళ్లే ముందు ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయో ఆ ఇంటర్వ్యూకి తగ్గట్టుగా శిక్షణ ఇస్తామని అన్నారు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాలలో మీ కెరియర్ ఉన్నత స్థితికి శిక్షణ ఇస్తామని అన్నారు. మొట్టమొదటిసారిగా టెక్నికల్ నాన్ టెక్నికల్ కెరీర్ టైమింగ్స్ తో కెరీర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన విజయవాడలో నెలకొల్పేమని రాష్ట్రంలో ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. డిటిపి,గ్రాఫిక్ డిజైనింగ్ జీఎస్టీ ఇన్కమ్ టాక్స్ సేల్స్ ఫోర్స్ మొదలైన సాఫ్ట్వేర్ రంగంలోనూ హార్డ్వేర్ రంగంలోనూ యానిమేషన్ ఆండ్రాయిడ్ ఓరాకిల్ డిజిటల్ మార్కెటింగ్ లకు కోర్సులు లో శిక్షణ ఇస్తామని అన్నారు.100% జాబ్ అసిస్టెన్స్తో ముందుకు వచ్చామని అన్నారు అనంతరం విహెచ్ఎస్ కెరియర్ ట్రైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో కారుకొండ వెంకటరావు మాట్లాడుతూకార్పొరేట్ లేవల్లో జాబ్ కొట్టాలంటే కార్పోరేట్ శిక్షణ అవసరమని ,కొన్ని ప్రసిద్ది చెందిన కంపినీలతో టై అప్ ఉందన్నారు.పేరుకే ఎం.సి.ఎ.బిటెక్,ఎంబిఏలో చేస్తారు కాని సిల్క్ తక్కవ ఉంటాయని అన్నారు. తమ వద్ద అత్యంత నైపుణ్యంతో కూడిన శిక్షణ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ రెహానా నాహీద్, వైసీపీ సీనియర్ నాయకుడు సుభాని,మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్,కోఆప్షన్ నంబర్ ఆలీం తదితరులు పాల్గొన్నారు.

About Author