NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెప్టంబ‌ర్ లో ఏపీఈసెట్ ప‌రీక్ష

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డిప్లొమ కోర్సులు పూర్తీ చేసి , బిటెక్ ద్వితియ సంవ‌త్సరంలో అడ్మిష‌న్ పొందేందుకు నిర్వహిస్తున్న ఏపీఈసెట్ షెడ్యూల్ ఖ‌రారైంది. శనివారం ఈసెట్ క‌న్వీన‌ర్లు రంగ‌జ‌నార్ధన్, శ‌శిధ‌ర్ వివ‌రాలు వెల్లడించారు. ఏపీఈసెట్ కు జులై 12 తేది నుంచి ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తామ‌ని, ఇప్పటి వ‌ర‌కు 19,526 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని తెలిపారు. ఈనెల 12 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చన్నారు. 1000 జ‌రిమానా తో 23వ తేది వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. సెప్టంబ‌ర్ 19న ప్రవేశ‌ప‌రీక్ష నిర్వహిస్తామ‌న్నారు. సెప్టంబ‌ర్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 48 ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

About Author