పెన్షన్దారులకు..ధైర్యమెచ్చిన ‘ఏపీజేఏసీ’
1 min read
పల్లెవెలుగు:APJAC అమరావతి మలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా APJAC అమరావతి APJAC అమరావతి ప్రధానకార్యదర్శి కె.వై.కృష్ణ, అసోసియేట్ చైర్మన్ నాగరమణయ్య ఆధ్వర్యంలో గురువారం పెన్షనర్లు ఇళ్లను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు శ్రీ.శనకరప్ప, ఎం.ఎల్.నరసయ్య మాట్లాడుతు ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ ఒకటవ తేదీన ఇవ్వాలని,కరువు భత్యం సకాలంలో విడుదల చేయాలని, పి.ఆర్.సి అరియర్స్ వెంటనే చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా రవాణాశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు, గ్రామం వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.