PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనరంజక సీఎంకు ఏపీజేఎఫ్​ అభినందన

1 min read

ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వీర్ల శ్రీరామ్ యాదవ్
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ : కరోన కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి అభినందలు తెలిపింది ఏపీజేఎఫ్​ నగర కమిటీ. గురువారం ఏపీ జర్నలిస్టుల ఫోరం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక లెనిన్​ సెంటర్​లో సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి బ్యానర్​కు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్​లోని ఏఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వీర్ల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచిన విలేకరుల క్షేమం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా గుర్తించాలని కోరారు. అలాగే కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5లక్షలు ఎక్స్​గ్రేషియా అందజేయాలని, 2021 మీడియా అక్రిడిటేషన్​ మంజూరు చేయాలని, కోవిడ్​తో ఆస్పత్రి, హోం క్వారంటైన్​లో ఉన్న పాత్రికేయులకు రూ. లక్ష తక్షణ సాయం, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు వ్యాక్సిన్​ వేయించాలని కోరారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన రు 50 లక్షలు భీమా రాష్ట్రంలో విలేకరులకు కూడా వర్తింపజేయాలని శ్రీరామ్ యాదవ్ కోరారు . ఏపీజేఎఫ్ నగర అధ్యక్షుడు యేమినేని వెంకట రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్, సంయుక్త కార్యదర్శిలు పొన్నపల్లి వీరభద్రాచారి (బాబ్జి),జిర్రా కోటేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శిలు యరజర్ల మురళి శంకర్, పోతిన శ్రీనివాసరావు(వాసు),బి మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

About Author