PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లోకేష్​ను కలిసిన..‘ఏపీజేఎఫ్​’ జర్నలిస్టులు

1 min read

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి

  • అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని నారా లోకేష్​ హామీ..

 పల్లెవెలుగు: అధికారంలోకి రాగానే రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని తెదేపా యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ అన్నారు. యువగళం యాత్రలో భాగంగా సోమవారం కర్నూలు నగరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు హరినాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ,సాయికుమార్ నాయుడు, జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు మధు సుధాకర్ ఆధ్వర్యంలో  వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం యువత భవిష్యత్తు కోసం ఎంతో శ్రమతో కూడిన యువగలం పాదయాత్ర చేపట్టి దిగ్విజయంగా ముందుకు సాగుతున్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ కు ముందుగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా  జర్నలిస్టులకు సంబందించిన కొన్ని సమస్యలను విన్నవించారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి తమ వంతు సహకారం, మద్దతు ఇవ్వాలని కోరారు.

డబుల్​ బెడ్​రూం..నిర్మించి ఇవ్వాలి..

 ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి పట్టాలిచ్చి, డబుల్ బెడ్రూం గృహా నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలన్నారు.ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరమ్  కర్నూలు జిల్లా కార్యాలయానికి 10 సెంట్ల స్థలం నామ మాత్రపు రేటుకు కేటాయించి రెండు అంతస్తుల భవనం నిర్మించి ఇవ్వాలని కోరారు. బ్యాంకులతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు రుణాలు ఇవ్వాలన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరహాలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న జర్నలిస్టులందరికీ నెలకు రూ.10 వేలు పెన్షన్ సౌకర్యం కల్పించాలనీ కోరారు. జర్నలిస్టుల పిల్లలకు ఎల్ కెజి నుండి ఇంటర్మీడియట్ వరకు 60 శాతం రాయితీతో కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో ప్రవేశాలు కల్పించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలనీ నారా లోకేష్ కి సూచించారు. నగరంలో జర్నలిస్టు స్థలాల్లో మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకొని, ఎందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరారు. నారా లోకేష్ ను కలిసిన వారిలో ఏపీజేఎఫ్ డెస్క్ అసోసియేషన్ అధ్యక్షుడు మధు,ఏపీజేఎఫ్ ఫోటో, ఎలక్ట్రాన్ మీడియా  వీడియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు రామస్వామి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, ఇస్మాయిల్, రవికుమార్, ఉరుకుందు తదితరులు ఉన్నారు.

About Author