ఫలితాల్లో ఏపీఎంఎస్..విద్యార్థుల ప్రభంజనం
1 min read
మండల టాపర్ గా భారతి..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మోడల్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శనివారం ఉ.11 గంటలకు మొదటి,రెండవ సంవత్సరం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.ఈ ఫలితాల్లో మిడుతూరు మోడల్ కళాశాల విద్యార్థులు రెండవ సంవత్సరం 56 గాను 55 మంది విద్యార్థులు 98 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. మండల టాపర్ గా పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన విద్యార్థి డి భారతి-977 మరియు చింతలపల్లి టి ధరణి-956 మార్కులతో టాపర్ గా నిలిచినట్లు అదేవిధంగా మొదటి సంవత్సరంలో 96 కు గాను 81 మంది విద్యార్థులు పాస్ అయ్యారని మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష తెలిపారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 79 కి గాను 54 రెండవ సంవత్సరంలో 40 కి 34 మంది పాస్ అయ్యారని బి అనూష-920,అభినాష్-810 మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ శనివారం తెలిపారు. కస్తూర్బా బాలికల కళాశాలలో మొదటి సంవత్సరం 30 కి 26, రెండవ సంవత్సరం లో నలుగురికి నలుగురు విద్యార్థులు పాస్ అయ్యారని ఎస్ఓ విజయలక్ష్మి తెలిపారు. మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాలల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు అభినందించారు.